నేషనల్ అవార్డ్స్ విజేతలకు పవన్ శుభాకాంక్షలు

శుక్రవారం కేంద్ర ప్రభుత్వం 2020 కి సంబదించిన చిత్రాలకు నేషనల్ అవార్డ్స్ ను ప్రకటించింది. ఈసారి ఎక్కువగా దక్షిణాది చిత్రాలు అవార్డ్స్ దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజేతలకు అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌.ఎస్‌.తమన్‌, ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. వీరందరికీ నా అభినందనలు, ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నారు.

విజేతల విషయానికి వస్తే..

తెలుగు..

జాతీయ ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్-ఎస్ థ‌మ‌న్ (అల వైకుంఠ‌పురంలో)
ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ-సంధ్యారాజు (నాట్యం)
బెస్ట్ మేక‌ప్ -టీవీ రాంబాబు (నాట్యం)

త‌మిళం..

బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌-సూరారై పోట్రు
జాతీయ ఉత్త‌మ న‌టుడుగా సూర్య (సూరారై పోట్రు),
జాతీయ ఉత్త‌మ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి (సూరారై పోట్రు)
ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌-జీవీ ప్ర‌కాశ్ కుమార్ (సూరారై పోట్రు)

హిందీ..

జాతీయ ఉత్త‌మ న‌టుడుగాఅజ‌య్ దేవ్‌గ‌ణ్ (తానాజీ)
జాతీయ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా విశాల్ భ‌ర‌ద్వాజ్ (1232 KMS డాక్యుమెంట‌రీ ఫిల్మ్‌)

మ‌ల‌యాళం

ఉత్తమ స‌హాయ న‌టుడు-బిజూ మీన‌న్ (అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్‌)

బెస్ట్ ఫీ మేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్-నాంచ‌మ్మ (అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్‌)

బెస్ట్ స్టంట్ కొరియోగ్ర‌ఫీ-(అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్‌)

ఉత్త‌మ నాన్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా కుంకుం అర్చ‌న్‌. బెస్ట్ బుక్ ఆన్ సినిమా ది లాంగెస్ట్ కిస్ నిలిచాయి. ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్ గా ఉత్త‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ నిలిచాయి. ఈ సారి బెస్ట్ క్రిటిక్ అవార్డు ఎవ‌రికీ లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

SHARE