అన్న కోసం తమ్ముడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే

నందమూరి అభిమానులకు తీపి కబురు..కళ్యాణ్ రామ్ నటించిన పాన్ ఇండియా మూవీ బింబిసార. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొనే విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సినిమా ట్రైలర్, కొన్ని పాటలని విడుదల చేసి ఆసక్తి పెంచిన యూనిట్..ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమయ్యారు.

జూలై 29వ తేదీ సాయంత్రం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ రానున్నారు. దీంతో మరోసారి నందమూరి అన్నదమ్ములు ఒకే వేదికపై కనబడనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రివ్యూ ను చూసిన ఎన్టీఆర్..చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపడం జరిగింది. ఇక ప్రీ రిలీజ్ వేడుక లో ఏమాట్లాడతారో అని అంత ఆసక్తిగా ఉన్నారు. ఆగస్టు 05 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది.

బింబిసార చిత్రాన్ని క‌ళ్యాణ్ రామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ థ్రెస్సా, సంయుక్త మీన‌న్‌, వారినా హుస్సెన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. ఎమ్.ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందించాడు.

SHARE