ట్రైలర్ టాక్ : ‘మాచర్ల నియోజకవర్గం’ అంత యాక్షనే

మాస్ట్రో తో హిట్ అందుకున్న నితిన్ ..ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌‏తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే స్టిల్స్ , టీజర్ , సాంగ్స్ ఆకట్టుకోగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.

‘ఈరోజు వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా’ అని నితిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. వినోదం మరియు యాక్షన్ తో నిండిపోయింది. ఇందులో కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా నితిన్ ఆకట్టుకున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికలు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న విలన్ రాజప్పగా సముద్రఖని ని చూపించారు.

అయితే రాజప్ప నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించాలని నిశ్చయించుకున్న సిద్దార్థ్.. అతనితో డైరెక్ట్ వార్ ప్రకటించాడు. కథేంటనేది ట్రైలర్ లోనే చెప్పే ప్రయత్నం చేశారు. “నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్లు.. వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా” వంటి డైలాగ్డ్ అభిమానులను అలరిస్తున్నాయి. నితిన్ పాత్ర పేరుకి కలెక్టర్ అయినప్పటికీ.. ఇన్ బిల్ట్ మాస్ క్యారెక్టర్ అని చూస్తే అర్ధమవుతుంది. ఓవరాల్ గా ట్రైలర్ ఫుల్లెన్త్ యాక్షన్ తో నింపేశారు.

నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నాడు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

SHARE