ముంబై లోకల్ ట్రైన్ లో లైగర్ జంట సందడి

విజయ్ దేవరకొండ – అనన్య జంటగా పూరి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లైగర్. ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ తో సినిమా ఫై మరింత ఆసక్తి నింపుతున్నారు. ఇప్పటికే టీజర్ , స్టిల్స్ , ట్రైలర్ రిలీజ్ చేసారు. తాజాగా హీరో – హీరోయిన్ ముంబై లోకల్ ట్రైన్ లో సందడి చేసారు. మాస్కులు ధరించి స్టేషన్‌కు చేరుకున్న వీరిద్దరూ ఫ్లాట్‌ఫామ్‌పైనే చాలాసేపు కూర్చొన్నారు.
అనంతరం రైలెక్కిన వీరిద్దర్నీ అందులో ఉన్న ప్రయాణికులు గుర్తించి.. సరదాగా ముచ్చటించారు. అభిమానులతో మాట్లాడిన తర్వాత అనన్య ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ విజయ్ సేదతీరారు.

ముంబైలో భారీ ట్రాఫిక్ లేకుండా చేయడానికే ఇలా లోకల్ ట్రైన్ ఎక్కినట్టు చెబుతున్నారు. ‘లైగర్’ ప్రమోషన్స్‌లో భాగంగా రేడియో ట్రయల్స్‌ను కిక్ స్టార్ట్ చేయడానికి వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ లోకల్ ట్రైన్ లో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రమ్యకృష్ణ, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంది.

SHARE