రాజకీయాలపై హీరో నిఖిల్ కామెంట్స్

కార్తికేయ 2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న హీరో నిఖిల్..తాజాగా రాజకీయాల ఫై తన స్పందనను తెలియజేసారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగగా..ఈ వేడుకకు పలువురు సినీ పెద్దలు , చిత్ర యూనిట్ హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేసారు. ఈ సందర్బంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాదానాలు తెలిపారు. అందులో రాజకీయాల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

గత ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీప్ రాజుకి మద్దతుగా ఇవ్వగా.. పెందుర్తి ఎమ్మెల్యేగా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో వైసిపి పార్టీకి సపోర్ట్ చేశారు కదా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదే పార్టీతో ఉంటారా ? అని ప్రశ్నించగా నేను సినిమాల్లో ఉన్నాను.. వైసిపి తో కాదు అంటూ సమాధానం ఇచ్చారు నిఖిల్.

ఇక గతంలో వైసిపికి సపోర్ట్ చేశారేంటి అంటే వాళ్లు మా బంధువులు అందుకే ప్రచారంలో పాల్గొన్నాను.. నేను సినిమాలో ఉన్నాను.. నేను ఒకే పార్టీతో లేను.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను.. గతంలో జెడి గారు జనసేనలో ఉన్నప్పుడు ఆయనకి కూడా సపోర్ట్ చేశాను.. హైదరాబాదులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను. టిడిపికి కూడా సపోర్ట్ చేశాను. నాకు ఏ పార్టీ లేదు.. పాలిటిక్స్ అవసరం లేదు.. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే వారికి సపోర్ట్ చేస్తాను.. పార్టీతో నాకు సంబంధం లేదు.. వ్యక్తులతోనే నాకు సంబంధం అంటూ చెప్పుకొచ్చారు.

SHARE