బింబిసార , సీతారామం చిత్రాలు చిత్రసీమకు ఊపిరి పోశాయి – చిరంజీవి

ఇక తెలుగు చిత్రసీమ పరిస్థితి అయిపోయినట్లే..థియేటర్స్ ఇక ఫంక్షన్ హాల్స్ చేసుకోవాల్సిందే అని అంత అనుకుంటున్నా సమయంలో ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం..ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడుతుండడంతో చిత్రసీమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాల విజయం ఫై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటను, ఉత్సాహాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తాయని మరోసారి నిరూపించాయన్నారు. ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. నిన్న విడుదలయిన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ చిత్రాల నటీనటులకు,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు..అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

SHARE