డైరెక్టర్లకు చిరంజీవి క్లాస్..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లకు క్లాస్ పీకారు. అమిర్ ఖాన్ , నాగ చైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ త్వరలో హిందీ , తెలుగు తో పాటు పలు భాషల్లో విడుదల అవుతుంది. కాగా తెలుగు లో చిరంజీవి ఈచిత్రాన్ని సమర్పించడం విశేషం. ఈ తరుణంలో ఈ సినిమా తాలూకా తెలుగు ప్రమోషన్ చిరంజీవి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు స్టిల్స్ రిలీజ్ చేసిన చిరు..హైదరాబాద్ లో చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ల తీరు ఫై కాస్త అసహనం వ్యక్తం చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ.. షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్లు డైలాగులు రాసిస్తున్నారని ..ఇది నటులకు ఇబ్బందిగా ఉంది.. నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశారు. ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెడతారు. టాలీవుడ్ డైరెక్టర్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. క్లాప్స్‌, జేజేలు కొట్టే సినిమాలు మాత్రమే చేస్తానన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లు నాకు వస్తె నేను చెయ్యనని… ఏమి చేస్తే క్లాప్ కొడతారు … జే జే లు కొడతారు అనేది నేను చూస్తానని వెల్లడించారు.

కానీ అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయని… అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు. అమీర్ ఖాన్ లాగా మేం చేయాలనుకుంటాం, మాకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నామని తెలిపారు. స్క్రిప్ట్ మీద అవగాహన కోసం వర్క్ షాప్ లు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా ఆచార్య తో వచ్చి భారీ ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో గాడ్ ఫాదర్ దసరా బరిలో రాబోతుంది.

SHARE