కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన ‘బింబిసార’

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన , నిర్మించిన చిత్రం బింబిసార. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించగా.. క‌ళ్యాణ్ రామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ థ్రెస్సా, సంయుక్త మీన‌న్‌, వారినా హుస్సెన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబట్టి చిత్రసీమ కు మళ్లీ కళ తీసుకొచ్చింది.

ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ..ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టింది. కళ్యాణ్ రామ్‌ కెరీర్‌లో ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏరియా వైజ్ కలెక్షన్స్‌..

నైజాం – రూ.2.15 కోట్లు

సీడెడ్ – రూ.1.29 కోట్లు

ఈస్ట్ – రూ.43 లక్షలు

వెస్ట్ – రూ.36 లక్షలు

ఉత్త‌రాంధ్ర – రూ.90 లక్షలు

గుంటూరు- రూ.54 లక్షలు

కృష్ణా – రూ. 34 లక్షలు

నెల్లూరు – రూ.26 క్షలు

కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.0.32 లక్షలు

ఓవర్సీస్‌ రూ.65లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్‌ (రూ.11.50 కోట్ల గ్రాస్‌)

SHARE