భోళా శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన

భోళా శంకర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. రేపు చిరంజీవి పుట్టినరోజును సందర్భంగా భోళా శంకర్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో చిరు తన స్టైలిష్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రిలీజ్ డేట్ ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. వచ్చే ఏడాది అంటే 2023, ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ప్రకటించారు. ప్రస్తుతం చిరు మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ తో పాటు బాబీ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు.

SHARE