పవన్ ఫై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో..అభిమానమో తెలియంది కాదు..వీలు కుదిరినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఫై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తుంటారు. తాజాగా మరోసారి అదే మాదిరి ట్వీట్ చేసి , అభిమానులను ఆకట్టుకున్నారు.

మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే అని అని ట్వీట్ చేశారు. తన దైవ సమానులైన పవన్… తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమాను త్వరగా తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.

పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ కలయికలో తీన్మార్ , గబ్బర్ సింగ్ చిత్రాలు వచ్చాయి. వీటిలో గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి..పవన్ కెరియర్ లోనే ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది.

SHARE