విజయ్ దేవరకొండ కు బండ్ల గణేష్ కౌంటర్..?

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడితే సునామే..ఆయన ట్వీట్ చేస్తే ప్రళయమే ..ఆ రేంజ్ లో బండ్ల గణేష్ స్పీచ్ కానీ ట్వీట్ కానీ ఉంటుంది. తనకు ఏమనిపిస్తే అది చెప్పడం , ట్వీట్ చేయడం ఆయన ప్రత్యేకత. తాజాగా గణేష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చిత్రసీమలో , సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా ఆయన ట్విట్టర్ లో…‘‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్’’ అంటూ తనదైన మార్క్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కే అని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. దీనికి కారణం..తాజాగా విజయ్ చేసిన కామెంట్స్ వల్లే.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో నిన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో చేసారు. ఈ సందర్బంగా విజయ్ మాట్లాడుతూ..నా అయ్యా తెల్వదు.. నా తాతా తెల్వదు.. అయినా ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. అంటూ విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశించి కామెంట్స్ చేసారు. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే విధంగా ఈ కామెంట్స్‌ను వివరిస్తున్నారు సినీ విమర్శకులు. ఈ కామెంట్స్ కు కౌంటర్ గానే బండ్ల గణేష్ ట్వీట్ చేసాడని కొంతమంది అంటున్నారు. మరి గణేష్ మనసులో ఏముందో తెలియదు కానీ సోషల్ మీడియా లో గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

SHARE