అభిమాని ఫ్యామిలీ తో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలియంది కాదు..ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ వద్ద మాములు హడావిడి చేయరు. అలాంటిది స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి కలవమంటే ఆ అభిమాని ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. తాజాగా ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు బాలయ్య స్వయంగా ఫోన్ చేయడం..కలిసి భోజనం చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలకృష్ణ తన 107 వ చిత్రం చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గత కొద్దీ రోజులుగా కర్నూల్ లో జరుగుతుంది. షూటింగ్ కోసం కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్న బాలకృష్ణ.. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు స్వయంగా ఫోన్ చేశారు. తాను కర్నూలులో ఉన్న హోటల్​కు కుటుంబంతో సహా రమ్మని ఆహ్వానించారు. ఫ్యామిలీతో సహా వెళ్లిన హుస్సేన్​ను బాలయ్య ఆత్మీయంగా ఆహ్వానించారు. వారితో కలిసి భోజనం చేశారు. హుస్సేన్‌ కొడుకుతో బాలకృష్ణ ఆడుకుని కాలక్షేపం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందుకే బాలయ్య మిమ్మల్ని దేవుడు అనేది..’ అంటూ కామెంట్స్ చేస్తూ… జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ సోషల్ మీడియాలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

SHARE