‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ డేట్ ప్రకటన

సుధీర్ బాబు , కృతి శెట్టి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా అనగానే ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ కారణంతో కూడా ఈ సినిమా కు మొదటి నుండి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అన్నింటికంటే ప్రధానంగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం వల్ల సినిమా ప్రేక్షకుల్లో మరియు మార్కెట్ లో మంచి బజ్ ను క్రియేట్ చేయగలిగింది అనడంలో సందేహం లేదు.

వరుసగా కృతి శెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉంది. ఇటీవల ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ఈ వారంలో మాచర్ల నియోజక వర్గం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నెల రోజుల గ్యాప్ లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

SHARE