‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా యంగ్ రెబెల్ స్టార్

మహానటి ఫేమ్ దుల్క‌ర్ స‌ల్మాన్‌ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్షన్లో వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌ వారు నిర్మిస్తున్న చిత్రం సీతారామం. ఆగస్టు 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలను జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాదులో గ్రాండ్ గా జరపబోతున్నారు. కాగా, ఈ వేడుకకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ మేరకు ‘సీతారామం’ చిత్ర నిర్మాణ సంస్థ స్వప్న సినిమా వెల్లడించింది. ‘మన డార్లింగ్ వస్తున్నాడు’ అంటూ ప్రకటించింది. కాగా, ‘సీతారామం’ చిత్రంలో సుమంత్, రష్మిక మందన కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు సల్మాన్. మరి ఆయన చెప్పినట్లు సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి.

SHARE