తమిళనాడు లో విషాదం : నూడిల్స్​ తిని రెండేళ్ల బాలుడు మృతి

పిల్లలు , పెద్దలు నూడిల్స్ ను ఎంతో ఇష్టంగా తింటారు..ముఖ్యంగా పిల్లలు సాయంత్రం కాగానే నూడిల్స్ తినేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. దీంతో తల్లులు సైతం తక్కువ టైంలోనే నూడిల్స్ రెడీ అవుతాయి కాబట్టి వాటిని వండిపెడుతుంటారు. అయితే ఇక్కడ ఓ తల్లి చేసిన తప్పిదం కారణంగా రెండేళ్ల బాలుడు నూడిల్స్ తిని చనిపోయాడు. రాత్రి చేసిన నూడిల్స్ ను తెల్లరిపెట్టేసరికి అవితిని ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

తిరుచ్చి జిల్లాలోని సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలెర్జీ సమస్యలతో బాధపడుతూ..చికిత్స తీసుకుంటున్నాడు. కాగా శుక్రవారం(జూన్ 17) రాత్రి బాలుడి తల్లి మహాలక్ష్మి.. నూడిల్స్ వండింది. ముగ్గురూ తిన్నాక మిగిలిన నూడిల్స్​ ఫ్రిజ్‌లో ఉంచింది. మరుసటి రోజు శనివారం (జూన్ 18) అదే నూడిల్స్​ను తరుణ్​కు అల్పాహారంగా పెట్టింది. అది తిన్నాక ఇంట్లోనే తరుణ్.. వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆ బాబును సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాబు ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ బాబు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు.

SHARE