వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో వైరల్

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో న్యూడ్‌ గా వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో ప్ర‌త్య‌ర్థులు గోరంట్ల మాధ‌వ్‌ను, వైసీపీని సోష‌ల్ మీడియాలో చెడుగుడు అడుకుంటున్నారు. రాయ‌డానికి, చూప‌డానికి కూడా ఇబ్బందిక‌ర రీతిలో గోరంట్ల మాధ‌వ్ అస‌భ్యంగా క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఎంపీ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండే ఇంత చిల్లరగా వ్యవహరించడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వైసీపీలోనూ సెగలు రేపుతోంది. లీకైన వీడియోను గమనిస్తే తనకు సన్నిహితంగా ఉండే మహిళతోనే ఎంపీ మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడారని భావిస్తున్నారు.ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ గోరంట్ల వ్యవహరించారని టీడీపీ మహిళా నేతలు విమర్శిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. న్యూడ్ వీడియో లీక్ కావడంతో వెంటనే గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

SHARE