వైయస్ విజయమ్మ‌కు తప్పిన‌ ప్రమాదం ..

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి , ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ‌కు పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ మిత్రుడు అయ్యప్పరెడ్డిని పరామర్శించేందుకు గురువారం కొందరితో కలిసి విజయమ్మ కర్నూలు వచ్చారు. పరామర్శ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గుత్త వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్న సమయంలో టైర్లు సడన్ గా పేలాయి. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు టైర్లు పేలటంతో వెనక వస్తున్న విజయమ్మ బంధువులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు.

కానీ, ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో స్థానిక నేతలు మరో కారు ఏర్పాటు చేయటంతో..అక్కడ నుంచి విజయమ్మ గుత్తి నుంచి మరో కారులో బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం విజయమ్మ కూతురు షర్మిల తో ఉంటుంది. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కుమారుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని..కుమార్తె కష్టాల్లో ఉన్న సమయంలో షర్మిలకు మద్దతుగా నిలవటం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

SHARE