రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగన్

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు బుధువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి 850 ఎకరాలను సేకరించామని, రూ. 3,700 కోట్లతో పోర్టు పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులే కాకుండా మరో నాలుగు పోర్టులకు త్వరలో భూమి పూజ చేస్తామని ఈ సందర్బంగా వెల్లడించారు. ఇక ఈ పోర్ట్ నిర్మాణం వల్ల 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చామని దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పోర్టుల వల్ల పరిశ్రమలు ఏర్పడుతాయని, ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోతాయని చెప్పుకొచ్చారు.

రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం జగన్‌. ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా.. సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఇదెంత అన్యాయమని ప్రశ్నించారు జగన్‌. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు.

SHARE