యానంలో 2 కేజీల పులస ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా అని కూడా పిలుస్తారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి జనం రాజధానిలో ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకుని వెళ్లేవారు. అలాంటి అరుదైన పులస చేప తాజాగా యానాం మార్కెట్ లో భారీ ధర పలికింది.

మంగళవారం రేవులో భైరవపాలెంకు చెందిన వ్యక్తి పులసకు వేలంపాట నిర్వహించారు. సుమారు 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ భారీ ధరకు కొనుగోలు చేసింది. పులస ను వేలం పాటలో రూ.19 వేలకు కొనుగోలు చేసింది పార్వతి. ప్రస్తుత సీజన్ లో పులసల అమ్మకం మొదలయ్యాక ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పులసలు ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేశాయని.. అందుకనే సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. సంవత్సరంలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పులసను గంగపుత్రులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పట్టుకుంటారు.

SHARE