పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా రూ. 30 వేల కోట్లు కావాలి- తులసిరెడ్డి

పోలవరం రాష్ట్రానికి ప్రసాదించిన వరమని అలాంటి ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా రూ. 30 వేల కోట్లు కావాలని అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదని అన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని విమర్శించారు.

ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే శక్తి లేదని… సొంతంగా ప్రాజెక్టును నిర్మించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందని అన్నారు.

SHARE