5 రోజుల పాటు తిరుమల దర్శనాన్ని రద్దు చేసుకోవాలని కోరిన టీటీడీ

ఆగస్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముంది. ఈ తరుణంలో టీటీడీ భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని కోరింది. భక్తులు పెద్ద సంఖ్య లో వచ్చే అవకాశం ఉండడం తో దర్శనానికి ఆలస్యం అవుతుందని , అలాగే రూమ్స్ కూడా దొరికే ప్రసక్తి తక్కువ ఉండడం తో ఇబ్బందులు పడతారని టీటీడీ తెలిపింది. భక్తులు దర్శనం, వసతి ముందుగానే బుక్ చేసుకొని రావాలని కోరింది.

వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీ తో పాటు పండుగ తో కూడా వ‌రుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న‌ ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో తిరుమ‌ల యాత్రికుల ర‌ద్ధీ అనూహ్యంగా పెరిగే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌లకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

SHARE