మున్సిపల్ ఛైర్‌పర్సన్‌‌తో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా

వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా..మున్సిపల్ ఛైర్‌పర్సన్‌‌తో వ్యవహరించిన తీరుఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ పార్టీ ట్విట్టర్ ద్వారా మండిపడుతూ..ఆదర్శంగా ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలే ఇలా పశువులు లాగా, బహిరంగంగా మహిళల పై అసభ్య ప్రవర్తన చేస్తుంటే, సమాజంలో భయం ఎక్కడ ఉంటుంది? అంటూ ట్వీట్ చేసారు.

అసలు ఏంజరిగిందంటే..

మదనపల్లెలో రోడ్లకు సంబంధించిన నాడు-నేడు ఫొటొ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మనూజా రెడ్డితో పాటు వైస్ ఛైర్మన్‌, కమిషనర్‌, ఇతర అధికారులు హాజరయ్యారు. అక్కడ.. తాను పొడుగ్గా ఉండడం, మున్సిపల్ ఛైర్ పర్సన్ మనూజా రెడ్డి పొట్టిగా ఉండడం వల్ల వీడియోలో కనపడరు అంటూ నవాజ్ బాషా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా మనూజా రెడ్డిని భుజంతో తట్టారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాధ్యతగల ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పబ్లిక్ గా ఈ పనిచేయడం ఏంటి అని అంత మండిపడుతున్నారు.

దీనిపట్ల టీడీపీ స్పందించింది. ‘ఆదర్శంగా ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలే ఇలా పశువులు లాగా, బహిరంగంగా మహిళల పై అసభ్య ప్రవర్తన చేస్తుంటే, సమాజంలో భయం ఎక్కడ ఉంటుంది?. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, అందరూ చూస్తూ ఉండగా, మహిళా చైర్ పర్సన్‍ను భుజంతో ఢీకొట్టి అసభ్యంగా ప్రవర్తిస్తారా ? వీరికి దిశా చట్టం వర్తించదా?’ అంటూ ట్వీట్ చేసింది.

SHARE