పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం నెలకొంది. అనకాపల్లి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు బీచ్కు వెళ్లగా.. అందులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. అందులో పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. అస్వస్థతకు గురైన మరో విద్యార్థి తేజను ఆస్పత్రికి తరలించారు. గలంతైన ఐదుగురు విద్యార్థులు జగదీష్ (గోపాలపట్నం) జశ్వంత్ (నర్సీపట్నం) సతీష్ (గుంటూరు) గణేష్(చూచుకొండ) చందు(ఎలమంచిలి)ల ఆచూకీ కోసం మెరైన్, కోస్ట్గార్డ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మిగిలిన 8 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు.

అనకాపల్లి డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 12మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్షలు రాసి సీతాపాలెం బీచ్‌కు వచ్చారు. వీరిలో ఏడుగురు స్నానానికి దిగగా.. మిగిలిన వారు తీరం ఒడ్డునే నిల్చున్నారు. ఒక్కసారిగాసముద్రంలోని అలలు ఎగిసిపడటంతోవీరంతా సముద్రంలో మునిగిపోయినట్టు సమాచారం.

ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు సూరిశెట్టి తేజను కొన ఊపిరితో కాపాడారు. చికిత్సకోసం అతన్ని అనకాపల్లి ఆసుపత్రికి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీతాపాలెం ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని వెల్లడించారు. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

SHARE