జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్న 30 ఇయర్స్ పృథ్వి

సినీ నటుడు , మాజీ వైసీపీ నేత 30 ఇయర్స్ పృథ్వి..జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యాడు. గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వి కి..జగన్ ఎస్విబిసి చైర్మన్ పదవి అప్పగించారు. కానీ ఆ పదవి చేపట్టిన అతి కొద్దీ రోజుల్లోనే పలు కారణాలతో రాజీనామా చేసారు. అప్పటి నుంచి పృధ్వీరాజ్ ను పార్టీ నుంచి పక్కన పెట్టడం.. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం.. ఇలా పూర్తిగా దూరం పెట్టారు.

ఈ తరుణంలో ఇప్పుడు పృథ్వి జనసేన పార్టీ లో చేరి ప్రజలకు సేవ చేయాలనీ భావిస్తున్నాడు. ఈ మేరకు జనసేన సీనియర్‌ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు సినీ నటుడు పృథ్విరాజ్‌. దీంతో త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్నారు పృథ్విరాజ్‌. అంతే కాదు తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచే ఎన్నికల బరిలో దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

SHARE