అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతరు మండలం ఏడుగురాళ్లపల్లి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో మరో 35మందికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒరిస్సాలోని భవానిపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు.

క్షతగాత్రులను ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒడిశా నుంచి వలస కూలీలతో విజయవాడ బయల్దేరగా.. మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది.. మృతులు, క్షతగాత్రులు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHARE