పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత..

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్లలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఆమెకు అస్వస్థతగా అనిపించింది. ఇంట్లోనే ఉన్న కుమారుడు నరసింహాన్ని పిలిచారు.. కొద్దిసేపటి ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో డాక్టర్ కు ఫోన్‌ చేయగా ఆయన పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు.

సీతామహాలక్ష్మి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావులు, నేతలు సంతాపాన్ని తెలియజేశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. వందేళ్ల జెండా పండుగ సందర్భంగా గతేడాది సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో పాటుగా కుటుంబ సభ్యులను సన్మానించారు. రూ 75 లక్షలను అందించారు. వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతి. దీనిని పురస్కరించుకొని కేంద్రం సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లేంందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె కన్నుమూశారు.

SHARE