పవన్ కళ్యాణ్ కు వైర‌ల్ ఫీవ‌ర్..ఈ వారం జ‌న‌వాణిని ర‌ద్దు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విపరీతమైన జ్వరం రావడం తో ఈ వారం జ‌న‌వాణిని ర‌ద్దు చేస్తున్నట్లు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. ఇటీవ‌లే ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్ బారిన పడ్డారు. ప‌వ‌న్‌ కళ్యాణ్ తో పాటు ఈ ప‌ర్య‌ట‌న‌లో పాలుపంచుకున్న ప‌లువురు పార్టీ నేత‌లు, ప‌వ‌న్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా వైర‌ల్ ఫీవ‌ర్ సోకింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ప‌వ‌న్‌కు వైరల్ ఫీవ‌ర్ సోకిన కార‌ణంగా ఈ నెల 24న (ఆదివారం) నిర్వ‌హించ‌నున్న జ‌న‌వాణిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు నాదెండ్ల ప్ర‌క‌టించారు. త‌దుప‌రి జ‌న‌వాణిని ఈ నెల 31న నిర్వ‌హిస్తామ‌ని, ఏ ప్రాంతంలో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కౌలు యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించారు. మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయమని, ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఏమేం పనులు చేస్తుందో, ఎలాంటి పథకాలు తీసుకొస్తుందో వచ్చే అక్టోబర్ నుంచి ప్రజలకు చెబుతామని పవన్ ప్రకటించారు. ‘రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలి? ప్రజలకు ఏం చేయాలి? రైతులకు ఏం చేయాలి? నిరుద్యోగులకు ఏం చేయాలి? ఆడబిడ్డలకు ఏం చేయాలో అవన్నీ చేస్తాం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఏపీ భవిష్యత్తుకు వైసీపీ ప్రభుత్వం హానికరం. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే ఏం జరుగుతుందో ఊహించాలి. నాకు ఎలాంటి కోరికలు లేవు. అధికారం వస్తే మంచిది.. రాకున్నా పోరాటం ఆపను. వంద తప్పులు సహిస్తాం.. భరిస్తాం.. తర్వాత తాట తీస్తాం. పోలీసులు కూడా వ్యవస్థ ప్రకారం పనిచేయాలి. అన్యాయం, తప్పు చేస్తే ప్రజలు ఎదురుతిరగాలి. ఎంతమందిపై కేసులు పెడతారు.. జైలులో పెడతారు. శ్రీలంక పరిస్థితి చూడండి.. ఏమైందో తెలుస్తోంది అన్నారు. వైసీపీ లో కొంత మంది మంచి వాళ్లు ఉన్నారు. కౌరవుల పక్కన బీష్ముడి లాగా అయిపోతారు.. ఆలోచించుకోండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

SHARE