ఈ నెల 20 న కడప జిల్లాలో పవన్ పర్యటన

Pawan kalyan nalgonda tour
pawan kadapa tour

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 20 న కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ‘ కౌలు రైతు భరోసా యాత్ర’ పేరిట ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 20 న కడప జిల్లాలో పవన్ యాత్ర చేపట్టబోతున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అంజేయనున్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. అలాగే అక్టోబర్ 05 నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పవన్ సన్నాహాలు చేస్తున్నారు.

SHARE