పల్నాడులో ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా..ఆయిల్ కోసం జనాలు కొట్లాట

ఫ్రీగా పినాయిల్ దొరుకుతుందన్న వదలని జనాలు..ఉచితంగా నూనె దొరుకుతుందంటే వదులుతారా..ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టి దానికోసం ఎగబడతారు. తాజాగా పల్నాడులో అదే జరిగింది. ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా పడిందని తెలుసుకొని జనాలు పరుగులుపెట్టారు. దొరికినకాడికి నింపుకొని పోయారు.

వివరాల్లోకి వెళ్తే..

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై … చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్​లో ఉన్న మంచి నూనె రోడ్డు పక్కనున్న గుంతలో పడి నిల్వ ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. నూనె తీసుకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో క్యాన్లు తీసుకుని వచ్చి నూనె తీసుకొనేందుకు పోటీపడ్డారు. తమ వెంట తెచ్చుకున్న క్యాన్లు నింపుకొని వెళ్లారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజలు వినకపోవడంతో చేసేది లేక వదిలేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

SHARE