మెగా బ్రదర్స్ కు సారీ చెప్పిన నారాయణ..శాంతించిన మెగా ఫ్యాన్స్

మొత్తానికి సిపిఐ నేత నారాయణ చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఫై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని నారాయణ తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారాయన. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. ఈ కామెంట్స్ ఫై మెగా అభిమానులతో పాటు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

నాగబాబు ట్విట్టర్ ద్వారా…నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’ అని నాగబాబు ట్వీట్లు చేశారు. ఇక మెగా అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా నారాయణ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దింతో నారాయణ మీడియా ముఖంగా తాను చేసిన కామెంట్స్ ను వెనక్కు తీసుకున్నారు.

బాషా దోషంగా భావించాలని.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని స్పష్టం చేశారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండని కోరారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దామని.. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని అగ్రహించారు.

SHARE