జగన్ కుంభకోణాన్ని నారా లోకేష్ బయటపెడతాడట..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సంబదించిన భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ”అంద‌రికీ ఆరోగ్య‌మ‌స్తు – ఇంటికి శుభ‌మ‌స్తు” నినాదంతో సొంత ఖ‌ర్చుతో మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య‌కేంద్రాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రంద్వారా ఆరోగ్య సంజీవ‌ని పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు ఉచితంగా వైద్య‌సేవ‌లందించ‌నున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వైద్యులు, సిబ్బంది, చికిత్స ప‌రిక‌రాల‌ను లోకేష్ స‌మ‌కూర్చారు. దాదాపు 200కు పైగా రోగ‌నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా చేయ‌నున్నారు. ఇక ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఫై లోకేష్ నిప్పులు చెరిగారు.

జగన్ టైం అయిపోయిందని.. ఇంటికెళ్లే సమయం దగ్గర పడిందంటూ లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డివి పది పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలంటన్న లోకేశ్.. రాష్ట్రంలో పెట్టబుడులు పెట్టాలంటే సీఎంఓలో వాటా ఎంత ఇవ్వాలనే చర్చ జరుగుతోందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవని.. అన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలేనంటూ లోకేశ్ వ్యంగ్యంగా విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డికి టైం అయిపోయిందని.. ఇంటికెళ్లే సమయం అతి దగ్గర్లోనే ఉందన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంఓలో వాటా ఎంత ఇవ్వాలనే చర్చ జరుగుతోందని.. గత మూడేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు.

SHARE