పూడిమడక బీచ్ లో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు వెలికితీత

అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం నెలకొంది. నిన్న శుక్రవారం సముద్ర తీరంలో గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఆరుగురు మృతి చెందారు. ఒకరు మాత్రం కోన ఊపిరితో హాస్పటల్ లో చికిత్స తీసుకున్నాడు. నిన్న సాయంత్రం నుండి అధికారులు గాలింపు చర్యలు చేపట్టి మొత్తం ఆరు మృత దేహాలను బయటకు తీశారు. పవన్ సూర్యకుమార్‌ (గుడివాడ) గణేశ్‌(మునగపాక), జగదీశ్‌(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్‌(గుంటూరు), జశ్వంత్‌(నర్సీపట్నం)ల మృతదేహాలను వెలికితీశారు.

అనకాపల్లి డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 12మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్షలు రాసి సీతాపాలెం బీచ్‌కు వచ్చారు. వీరిలో ఏడుగురు స్నానానికి దిగగా.. మిగిలిన వారు తీరం ఒడ్డునే నిల్చున్నారు. ఒక్కసారిగాసముద్రంలోని అలలు ఎగిసిపడటంతోవీరంతా సముద్రంలోకి వెళ్లిపోయారు. ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు సూరిశెట్టి తేజను కొన ఊపిరితో కాపాడారు. చికిత్సకోసం అతన్ని అనకాపల్లి ఆసుపత్రికి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

SHARE