వరద ప్రాంతాల్లో చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి రోజా

వరద ప్రాంతాల్లో చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా..అనంతరం మీడియా తో మాట్లాడుతూ..చంద్రబాబు ఫై విమర్శలు కురిపించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేయలేని వ్యక్తి.. ముంపు మండలాలను జిల్లాగా మారుస్తారట అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు కూడా రావని మంత్రి రోజా. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా అప్పులు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ నాయకులు ఎంజాయ్ చేశారని విమర్శించారు. అంతకు ముందు ..ఉదయం విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు.

SHARE