శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత..

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. శనివారం రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ లోని 5,6,7 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణ‌మ్మ‌కు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్‌ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వరదలు వస్తే, మరిన్ని గేట్లు ఎత్తేందుకు రంగం చేసింది ఏపీ సర్కార్‌.

ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. గతవారం కురిసిన భారీ వర్షాల నుండి ప్రజలు ఇంకా తేరుకోకముందే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుండడం తో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. గతం వారం కురిసిన భారీ వర్షానికి అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా గోదావరి నది ఉద్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గతం లో ఎన్నడూ లేని విధంగా 70 అడుగుల మేర ప్రవహించింది. దీంతో చాల ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడిప్పుడు జనాలు బయటకు వస్తుండగా..మరోసారి వర్షాలు పడుతుండడం..గోదావరి వరద ఉదృతి పెరుగుతుండడం తో అంత భయపడుతున్నారు.

SHARE