చంద్రబాబు కు షాక్ ఇచ్చిన కేశినేని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు కు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని పెద్ద షాక్ ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కు ఎయిర్ పోర్ట్ లో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అయితే చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్‌ బతిమాలినా కూడా కేశినేని లెక్కచేయలేదు. చంద్రబాబు పక్కన నడిచేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. అందరి ముందు కేశినేని వైఖరి చూసి చంద్రబాబు నిర్ఘాంతపోయారు.

గత కొలంగా నాని టీడీపీతో అంటిముట్టన్నట్లుగా ఉంటున్నారు. తన తమ్ముడిని టీడీపీ ప్రోత్సహించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. నాని తమ్ముడు చిన్ని కూడా విజయవాడ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. తనకు కాకుండా తన తమ్ముడికి పార్టీ టికెట్ ఇస్తుందేమోననే అసహనంలో నాని ఉన్నారు. మొన్న తన కూతురు నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు, లోకేష్ తో నాని ఉత్సాహంగానే కన్పించారు. ఇంతలోనే ఈ విధంగా వ్యవహరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా అజాదీ కా అమృతోత్సవ్ నేషనల్ కమిటీ కార్యక్రమంలో పాల్గొంనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరగనుంది.

SHARE