సోదరునిపైనే పోలీసులకు పిర్యాదు చేసిన ఎంపీ కేశినేని నాని

టిడిపి ఎంపీ కేశినేని నాని సొంత సోదరునిపైనే పోలీసులకు పిర్యాదు చేయడం ఇప్పుడు టీడీపీ పార్టీ లో , రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ పిర్యాదు ఇప్పుడు ఇచ్చింది కాదు మే 27 న ఇచ్చారు. కాకపోతే ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా తాను ఉపయోగించే వీఐపీ వాహన స్టిక్కర్ లాంటిదే నకిలీది తయారు చేసుకుని విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనం నంబర్ టీఎస్07హెచ్‌డబ్ల్యూ 777 అని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంపీ ఫిర్యాదు మేరకు జూన్ 9వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. కేశినేని నాని ఫిర్యాదు చేసిన వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలేశారు. అయితే, ఈ వాహనం నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తుండటం గమనార్హం. హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్న తన సొంత సోదరుడిపైనే కేశినేని నాని ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చ కు దారి తీసింది.

SHARE