విరాళాల కోసం జ‌న‌సేన పిలుపు

నా సేన కోసం..నా వంతు అంటూ విరాళాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను విడుద‌ల చేసింది. జ‌న‌సేన‌కు రూ.10 మొద‌లుకొని ఎంతైనా విరాళం ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్ల‌కే మొగ్గు చూపుతున్న వేళ‌… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధాన‌మైన ఫోన్ నెంబ‌ర్‌కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని ర‌కాల యూపీఐ యాప్‌ల‌ను అనుసంధానించారు. ఆ నెంబ‌ర్ ఇదేనంటూ 7288040505 మొబైల్ నెంబ‌ర్‌ను జ‌న‌సేన త‌న పోస్ట్‌లో ప్ర‌కటించింది. విరాళాల‌ను సుల‌భంగా అందించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా జన‌సేన తెలిపింది.

SHARE