రేపు కాకినాడ లో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు కాకినాడలో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదలైంది. రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45-12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3.2లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాపు నేస్తం కోసం ప్రభుత్వం సుమారు రూ.490 కోట్లు వెచ్చిస్తోంది.

ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్జిక సహాయాన్ని అందిస్తోంది.అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12,000/- వేల లోపు ఉండాలి. కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లోదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించరాదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు, ఆటో, టాటాఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య వికలాంగ పెన్సన్‌ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులే.

SHARE