భారీ వర్షంలోనే కొనసాగుతున్న జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఓ పక్క జోరు వర్షం కురుస్తున్నప్పటికీ జగన్ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు.

‘‘ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని తెలిపారు. జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని జగన్‌ తెలిపారు. పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో వరద బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు. శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని వరద బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. వాలంటీర్లు బాగా పనిచేశారని అన్నారు.

SHARE