ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు.

మనవతా విలువకు ఉదాహరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలోని హైలైట్స్ :

మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం
అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చాం
పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చాం
ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పింఛన్‌ ఇస్తున్నాం
విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు
అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నాం
రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం
ప్రతి మండలానికి రెండు పీహెచ్‌పీలు తీసుకొచ్చాం
అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం
ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నాం
సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేశాం
నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశాం
మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం మనది
ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరం
పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం.

SHARE