ఏపీలో కేబుల్ టీవీ ఆపరేటర్లకు గుడ్ న్యూస్

కేబుల్ టీవీ ఆపరేటర్లకు గుడ్ న్యూస్ తెలిపారు జగన్.. ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్‌ను రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. గతంలో పాదయాత్ర సందర్భంగా అనేకమంది కేబుల్ ఆపరేటర్లు తమకు పోల్ టాక్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయంటూ జగన్ దృష్టికి తెచ్చారనీ, దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ఆ టాక్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.

SHARE