రేపు ఢిల్లీ కి ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేసింది పార్టీ కార్యాలయం. ఈ ఢిల్లీ పర్యటనలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే… రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి.. 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి 9:15 గంటలకు ఢిల్లీ చేరుకుని జన్‌పథ్‌-1లోని నివాసంలో రాత్రి బస చేయనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే ప్రధాన లక్ష్యంగా భేటీలో చర్చకు రానుంది.

SHARE