అచ్యుతాపురం లో మరోసారి విష వాయువు లీక్..50 మంది మ‌హిళ‌ల‌కు అస్వస్థ‌త‌

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లో మరోసారి విష వాయువు లీక్ అయ్యింది. సెజ్​లోని ఓ సీడ్స్ దుస్తుల కంపెనీ సమీపంలో విషవాయువు లీకైంది. దీంతో 50 మంది మ‌హిళ‌లు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహతప్పి పడిపోగా… పలువురు ఉద్యోగులను అంబులెన్స్​లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని కంపెనీ ఆవరణలో ప్రాథమిక చికిత్స కొనసాగిస్తున్నారు. జూన్ నెలలోను ఇదే విధంగా గ్యాస్ లీక్ కావడం తో దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడంతో ఇబ్బందిపడ్డారు.

SHARE