టీడీపీ కి భారీ షాక్..గంజి చిరంజీవి రాజీనామా

గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి రాజీనామా చేశారు. నారా లోకేష్ ప్రతినిత్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవి రాజీనామా చేయడం… మంగళగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

రాజీనామా అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ..’తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరాను. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. అయితే టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానపరిచారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది.

ఆ ఒక్క సీటును కుమారుడి కోసం లాగేసుకొని మాకు ద్రోహం చేశారు. లోకేష్‌ కోసం ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన నన్ను పక్కకు పెట్టారు. పార్టీని నేను మోసం చేస్తే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఒకవేళ పార్టీ నన్నుమోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తాడు. 2019 చివరి వరకు సీటు నీదే అని నమ్మించి టికెట్‌ ఇవ్వకుండా తీవ్రంగా అమానించారని’ గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

SHARE