పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగిన మంత్రి దాడిశెట్టి రాజా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఏపీ ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాపులు పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితి లేదని.. తుని ఘటనలో కాపులను చిత్రహింసలకు గురిచేసిన చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పవన్ కల్యాణ్ కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టేనని కాపులకు అర్థమైందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటున్న పవన్ కల్యాణ్ తానేమో టీడీపీ వైపు చూస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేందుకే పవన్ జనసేన పార్టీని స్థాపించాడని ఆరోపించారు.

SHARE