రేపు పోలవరం ముంపు ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందం పర్యటన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు ముంపు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికి పూర్తిగా వారు తేరుకోలేదు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు పలు పార్టీ లు , పలు సేవ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే రాజకీయ నేతలు సైతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వారి బాగోగులు అడిగితెలుసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి , అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు.

ఈ నేపథ్యంలో రేపు సిపిఐ ప్రతినిధి బృందం పర్యటించబోతున్నారు. వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోని బృందం రేపు (ఆగస్టు 3) వ తేదీన పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రతిఏటా వరదల్లో చిక్కుకొని పోలవరం నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి వారికి వెంటనే ఇల్లు నిర్మించి పునరావాసము కల్పించాలన్నారు.

SHARE