వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన జగన్

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో మూడో విడత కాపునేస్తం పధకం నిధులను విడుదల చేసారు సీఎం జగన్. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 3క్షల మందికి పైగా మహిళలకు 490 కోట్లు ఇచ్చామని.. 3,27,244 మందికి మరో రూ.490 కోట్లు ఇచ్చామని జగన్ చెప్పారు. ఒక్కరు కూడా పథకం అందకుండా మిగిలిపోకూడదనే తపనతో అడుగులు ముందుకు వేస్తున్నామని జగన్ అన్నారు.

వరుసగా మూడో ఏడాది 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాపులకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఇస్తామన్న చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని జగన్ విమర్శించారు. హామీలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు.

SHARE