పేటీఎం బ్యాచ్‌ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారు – చంద్రబాబు

గోదావరి ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..ముఖ్యమంత్రి జగన్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. శుక్రవారం అల్లూరి జిల్లా గన్నవరంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేటీఎం బ్యాచ్‌ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఆనంతబాబు బాధితులు ఎక్కువగా ఉన్నారని.. అనంతబాబును కాపాడే కొందరు పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

వరద బాధితులను ఆదుకోలేనంటూ సీఎం జగన్‌ చేతులెత్తేశారని మండిపడ్డారు. బాబాయిని చంపి ఆ కేసు నాపై పెట్టినవాళ్లు.. ఇంకెవరినైనా చంపి మీపై పెడతారని ప్రజలకు హితబోధ చేశారు. నిజాయతీ, విశ్వసనీయత లేని నేతలతో రాష్ట్రానికే ప్రమాదమని సూచించారు. రోడ్డు మార్గాన వెళ్లి పరామర్శించలేని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. వరదలతో బాధిత ఇళ్లలో ఫ్యాన్ ఆగినందున.. ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్​ను ప్రజలు ఆపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

SHARE