నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు..వ‌ర‌ద బాధితుల‌కు జగన్ సర్కార్ ఇస్తున్న నిత్యావసరాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు , వరదలు సంభవించాయి. ముఖ్యంగా గోదావరి ఉప్పొంగిపొర్లడంతో వందల ఇల్లు నీట మునిగాయి. ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారికీ నిత్యావసరాలు పంపిణి చేస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ ఇస్తున్న నిత్యావసరాలను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు. ముంపు బాధితుల‌కు అందించిన వ‌ర‌ద సాయం ఇదేనంటూ మంగ‌ళ‌వారం ఓ ఫొటోను పంచుకున్నారు. నాలుగంటే… నాలుగేనంటూ ఆయ‌న స‌ద‌రు పోస్ట్‌కు కామెంట్ జ‌త చేశారు.

జ‌గ‌న్ స‌ర్కారు అంద‌జేసిన వ‌ర‌ద సాయం నిత్యావసరాల‌ను ఓ చేట‌లో పెట్టిన ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. అందులో నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు మాత్ర‌మే ఉన్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం…. లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే! అంటూ చంద్ర‌బాబు ఓ సెటైర్ సంధించారు.

SHARE