ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఫై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో వ్యవహారం ఫై టీడీపీ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. గోరంట్ల మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాము అని ప్రభుత్వం చెపుతుంది..అంబటి, అవంతి వాయిస్ ను ఫోరెన్సిక్ ల్యాబుకు ఎందుకు పంపలేదు..? అని ఉమా ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ వీడియో ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతుందని అగ్రహం వ్యక్తం చేశారు. ఒంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క గట్టే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.. అయినా ఈ వీడియో ఫై ఇంత జాప్యం ఎందుకు..? అని నిలదీశారు.

సజ్జల కానీ.. మాధవ్ ను వెనకేసుకొచ్చే ఏ నాయకుడైనా.. మాధవ్ వీడియోను వాళ్ల ఇంట్లో చూపగలరా..? అని ఉమా ప్రశ్నించారు. మాధవ్ న్యూడ్ ఎపిసోడ్ పై సీఎం జగన్ ఎందుకు మౌవం వహిస్తున్నారు..? అంటూ నిప్పులు చెరిగారు. మాధవ్ ఢిల్లీ నుంచి హిందూపురానికి వెళ్తున్నారట.. ఏ డ్రెస్సులో వస్తారో..? న్యూడ్ వీడియోలో కన్పించినట్టే అనంతపురానికి వస్తారా..? అని నిలదీశారు.

SHARE